Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

ఎజ్రా 10

Ezr 10:1  ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట. .. సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా 
Ezr 10:2  ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెనుమేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. 
Ezr 10:3  కాబట్టి యీ పని ధర్మ శాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము. 
Ezr 10:4  లెమ్ము ఈ పని నీ యధీనములో నున్నది, మేమును నీతోకూడ నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా 
Ezr 10:5  ఎజ్రా లేచి, ప్రధాన యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయు లందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా 
Ezr 10:6  ఎజ్రా దేవుని మందిరము ఎదుటనుండి లేచి, ఎల్యాషీబు కుమారుడైన యోహానానుయొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి, చెరపట్టబడినవారి అపరాధమును బట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయ కుండెను. 
Ezr 10:7  చెరనుండి విడుదల నొందినవారందరు యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటియందును యెరూషలేము పట్టణమందును ప్రకటనచేయబడెను. 
Ezr 10:8  మరియు మూడు దినములలోగా ప్రధానులును పెద్దలును చేసిన యోచనచొప్పున ఎవడైనను రాకపోయినయెడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందినవారి సమాజములోనుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. 
Ezr 10:9  యూదా వంశస్థులందరును బెన్యామీనీయు లందరును ఆ మూడు దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది తొమ్మిదవ నెల; ఆ నెల యిరువదియవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు, ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి. 
Ezr 10:10  అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెనుమీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లిచేసికొని, ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. 
Ezr 10:11  కాబట్టి యిప్పుడు మీ పితరులయొక్క దేవుడైన యెహోవా యెదుట మీ పాపమును ఒప్పుకొని, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి, దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి. 
Ezr 10:12  అందుకు సమాజకులందరు ఎలుగెత్తి అతనితో ఇట్లనిరినీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది. 
Ezr 10:13  అయితే జనులు అనేకులై యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువ లేము, ఈ పని యొకటి రెండు దినములలో జరుగునది కాదు; ఈ విషయములో అనేకులము అపరాధులము; కాబట్టి సమాజపు పెద్దలనందరిని యీ పనిమీద ఉంచవలెను, 
Ezr 10:14  మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లిచేసికొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను; మరియు ప్రతి పట్టణముయొక్క పెద్దలును న్యాయాధిపతులును ఈ సంగతినిబట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండ తొలగి పోవునట్లుగా వారితోకూడ రావలెను అనిచెప్పెను. 
Ezr 10:15  అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణ యింప బడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులై యుండిరి. 
Ezr 10:16  చెరనుండి విడుదలనొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులును వారి పితరుల యింటి పేరు లనుబట్టి తమ తమ పేరుల ప్రకారము అందరిని వేరుగా ఉంచి, పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. 
Ezr 10:17  మొదటి నెల మొదటి దిన మున అన్యస్త్రీలను పెండ్లి చేసికొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. 
Ezr 10:18  యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగాయోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరుల లోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును. 
Ezr 10:19  వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. 
Ezr 10:20  ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా 
Ezr 10:21  హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా, 
Ezr 10:22  పషూరు వంశములో ఎల్యో యేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా, 
Ezr 10:23  లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు, 
Ezr 10:24  గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు. 
Ezr 10:25  ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా, 
Ezr 10:26  ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా. 
Ezr 10:27  జత్తూ వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్యా యెరేమోతు జాబాదు అజీజా. 
Ezr 10:28  బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి, 
Ezr 10:29  బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షెయాలు 
Ezr 10:30  రామోతు, పహత్మో యాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయశేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే, 
Ezr 10:31  హారిము వంశములో ఎలీయెజెరు ఇష్షీయా మల్కీయా షెమయా 
Ezr 10:32  షిమ్యోను బెన్యామీను మల్లూకు షెమర్యా, 
Ezr 10:33  హాషుము వంశములో మత్తెనై మత్తత్తా జాబాదు ఎలీపేలెటు యెరేమై మనష్షే షిమీ, 
Ezr 10:34  బానీ వంశములో మయదై అమ్రాము ఊయేలు 
Ezr 10:35  బెనాయా బేద్యా కెలూహు 
Ezr 10:36  వన్యా మెరేమోతు ఎల్యాషీబు 
Ezr 10:37  మత్తన్యా మత్తెనై యహశావు 
Ezr 10:38  బానీ బిన్నూయి షిమీ 
Ezr 10:39  షిలెమ్యా నాతాను అదాయా 
Ezr 10:40  మక్నద్బయి షామై షారాయి 
Ezr 10:41  అజరేలు షెలెమ్యా షెమర్యా 
Ezr 10:42  షల్లూము అమర్యా యోసేపు 
Ezr 10:43  నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు 
Ezr 10:44  వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. 

No comments:

Post a Comment