Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

ఎజ్రా 2

Ezr 2:1  బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి 
Ezr 2:2  యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది. 
Ezr 2:3  పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు, 
Ezr 2:4  షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు, 
Ezr 2:5  ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు, 
Ezr 2:6  పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు, 
Ezr 2:7  ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు, 
Ezr 2:8  జత్తూ వంశస్థులు తొమ్మిదివందల నలువది యయిదుగురు, 
Ezr 2:9  జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది, 
Ezr 2:10  బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు, 
Ezr 2:11  బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు, 
Ezr 2:12  అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు, 
Ezr 2:13  అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు, 
Ezr 2:14  బిగ్వయి వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు; 
Ezr 2:15  ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు, 
Ezr 2:16  అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు, 
Ezr 2:17  బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు, 
Ezr 2:18  యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు, 
Ezr 2:19  హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు, 
Ezr 2:20  గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు, 
Ezr 2:21  బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, 
Ezr 2:22  నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు, 
Ezr 2:23  అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు, 
Ezr 2:24  అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు, 
Ezr 2:25  కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు, 
Ezr 2:26  రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు, 
Ezr 2:27  మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, 
Ezr 2:28  బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు, 
Ezr 2:29  నెబో వంశస్థులు ఏబది ఇద్దరు, 
Ezr 2:30  మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు, 
Ezr 2:31  ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు, 
Ezr 2:32  హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది, 
Ezr 2:33  లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు, 
Ezr 2:34  యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు, 
Ezr 2:35  సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది, 
Ezr 2:36  యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు 
Ezr 2:37  ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు, 
Ezr 2:38  పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు, 
Ezr 2:39  హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు, 
Ezr 2:40  లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు, 
Ezr 2:41  గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు, 
Ezr 2:42  ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు, 
Ezr 2:43  నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు, 
Ezr 2:44  కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశ స్థులు, 
Ezr 2:45  లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, 
Ezr 2:46  హాగాబు వంశస్థులు, షల్మయి వంశ స్థులు, హానాను వంశస్థులు, 
Ezr 2:47  గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, 
Ezr 2:48  రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, 
Ezr 2:49  ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, 
Ezr 2:50  అస్నా వంశ స్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, 
Ezr 2:51  బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, 
Ezr 2:52  బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, 
Ezr 2:53  బర్కోసు వంశస్థులు, సీసెరా వంశ స్థులు, తెమహు వంశస్థులు, 
Ezr 2:54  నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, 
Ezr 2:55  సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, 
Ezr 2:56  యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, 
Ezr 2:57  షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు, 
Ezr 2:58  నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు. 
Ezr 2:59  మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను. 
Ezr 2:60  వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు. 
Ezr 2:61  మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయు డైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు. 
Ezr 2:62  వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. 
Ezr 2:63  మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను. 
Ezr 2:64  సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను. 
Ezr 2:65  వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి. 
Ezr 2:66  వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు, 
Ezr 2:67  వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను. 
Ezr 2:68  కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. 
Ezr 2:69  పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి. 
Ezr 2:70  యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీ యులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. 

No comments:

Post a Comment